
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిను మంగళవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో గూడూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు కలిశారు.ఈ సందర్భంగా జగనన్న సేవా సమితి అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి సంయుక్త కార్యదర్శి ఊటుకూరు మహేందర్ రెడ్డి, ఆయన సతీమణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు మరియు గూడూరు జడ్పిటిసి ఊటుకూరు యామిని రెడ్డి, ఈదులపల్లి సుబ్బా నాయుడు, కందుకూరు సర్పంచ్ యనమల శ్రీనివాసులు, గూడూరు మండల మహిళా అధ్యక్షురాలు మరియు కొమ్మనేటూరు గ్రామ సర్పంచ్ పాలెపు వెంకటమ్మ, ఆమె భర్త మరియు వైఎస్ఆర్సిపి నెల్లూరు జిల్లా ఎస్సి విభాగ ప్రధాన కార్యదర్శి పాలెపు గోపాలయ్య పాల్గొన్నారు.
గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు.
ప్రజవీక్షణం – గూడూరు.











