
అమరావతి, మార్చి 10: రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఇఫ్తార్ విందుల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.1.50 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
మొత్తం కేటాయించిన నిధుల్లో రూ.1 కోటి ప్రభుత్వం నుంచి, మరో రూ.50 లక్షలు ఏపీ స్టేట్ హజ్ కమిటీ నిధుల నుంచి సమకూర్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్ర స్థాయి ఇఫ్తార్ విందును మార్చి 13న విజయవాడ లబ్బీపేటలోని ‘ఏ కన్వెన్షన్’లో నిర్వహించేందుకు రూ.75 లక్షలు కేటాయించారు.
మిగిలిన రూ.75 లక్షలను రాష్ట్రంలోని 26 జిల్లాలకు పంపిణీ చేసి, అక్కడ జిల్లా స్థాయిలో ఇఫ్తార్ విందులు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.











