గూడూరులో ఘనంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నెల్లూరు జిల్లా గూడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం గూడూరు సనత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్సీ, గూడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి మెరిగ మురళీధర్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
మొదటగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా మెరిగ మురళీధర్ మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని స్థాపించి ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని కూడా పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. ప్రజల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తోందని అన్నారు.వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారని తెలిపారు.
రాష్ట్ర ప్రజలు మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకొని సంక్షేమ పరిపాలన కొనసాగాలని ఆశతో ఎదురుచూస్తున్నారని అన్నారు. గూడూరు నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న నాయకులు, మహిళలు, యువత, కార్యకర్తలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తరఫున నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గూడూరు టౌన్ మరియు గూడూరు మండలం అధ్యక్షులు, పార్టీ నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Prajaveek Shanam