ఎండల తీవ్రతతో ప్రజల అవస్థలుగూడూరులో సలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజల విజ్ఞప్తి

రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పల్లెల నుండి పనుల కోసం గూడూరు పట్టణానికి వస్తున్న ప్రజలు దాహార్ధితో తీవ్రంగా అలసిపోతూ అవస్థలు పడుతున్నారు. మండుతున్న ఎండలో ప్రయాణిస్తూ పట్టణానికి చేరుకున్న తరువాత తాగునీరు అందుబాటులో లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెబుతున్నారు.ప్రస్తుతం వేసవి వేడి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్న సమయంలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. పల్లెల నుండి బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై గూడూరు పట్టణానికి వచ్చే రైతులు, కార్మికులు, మహిళలు మరియు వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలో తాగునీటి సౌకర్యాలు తక్కువగా ఉండటంతో దాహార్ధి తీర్చుకోవడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.ప్రత్యేకంగా బస్టాండ్ ప్రాంతం, ప్రభుత్వ కార్యాలయాల వద్ద, మార్కెట్ ప్రాంతాలు, ఆసుపత్రుల దగ్గర ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో తాగునీరు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.గతంలో వేసవి కాలంలో పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో సలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా చల్లని తాగునీరు అందించేవారని ప్రజలు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటి సౌకర్యాలు కనిపించకపోవడంతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వెంటనే సలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.ముఖ్యంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రభుత్వ ఆసుపత్రి, మార్కెట్ యార్డ్, ప్రధాన కూడళ్ల వద్ద సలివేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రజలకు ఎంతో ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. దీనివల్ల పల్లెల నుండి వచ్చే ప్రజలు, ప్రయాణికులు, రోజువారీ కూలీలు దాహార్ధి నుంచి ఉపశమనం పొందుతారని అంటున్నారు.అధికారులు వెంటనే స్పందించి పట్టణంలోని కీలక ప్రాంతాల్లో తాగునీటి సదుపాయాలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకుని సలివేంద్రాలు ఏర్పాటు చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు./

Prajaveek Shanam