పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం

ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి: ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ

చిల్లకూరు, అక్టోబర్ 21: ప్రజా వీక్షణం ప్రతినిధి

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఎం.వి. రావు ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ పిలుపునిచ్చారు.బుధవారం చిల్లకూరు మండలం పల్లమాల కాలనీలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎం.వి. రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం గ్రామంలోని చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, వీలైనంత వరకు పూర్తిగా నివారించాలని మహిళలకు సూచించారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా పర్యావరణానికి మేలు చేసే గుడ్డ సంచులను వినియోగించాలని కోరుతూ మహిళలకు గుడ్డ సంచులను పంపిణీ చేశారు. చిన్నారులు పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తూ వారికి సాక్సులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ముప్పవరపు లీలా మోహన్ కృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని, ప్రతిరోజూ స్నానం చేస్తూ శుభ్రమైన, పొడి దుస్తులను ధరించాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన అలవాట్లను పెంపొందించుకుంటే అనేక అనారోగ్య సమస్యలను నివారించవచ్చని తెలిపారు. చిన్నతనం నుంచే పిల్లలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎం.వి. రావు ఫౌండేషన్ కార్యదర్శి ఎం. విజయలక్ష్మి, స్థానిక మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam