అంగన్‌వాడి కేంద్రాలలో పరిశుభ్రతఘనంగా పక్షోత్సవాలు

గ్రామ మహిళలకు అవగాహన – ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

గూడూరు ప్రాజెక్ట్ పరిధిలోని వెడిచర్ల గ్రామంలో అంగన్‌వాడి కేంద్రాలలో పరిశుభ్రత పక్షోత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ జి. స్వరూప రాణీ తెలిపారు. గాంధీనగర్ సెక్టార్ పరిధిలోని వెదిచర్ల ఎస్టీ కాలనీలో ఉన్న అంగన్‌వాడి కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ మహిళలు, సిబ్బంది, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలను ఒక చోటుకు చేర్చి పరిశుభ్రత ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. “శుభ్రత మన బాధ్యత – ఆరోగ్యం మన హక్కు” అనే నినాదాన్ని వివరంగా చెప్పుతూ, ప్రతి కుటుంబం తమ ఇళ్లు మాత్రమే కాకుండా పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, సరైన ప్రదేశాల్లో వేయాలని సూచించారు.ప్రత్యేకంగా పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని, చిన్న వయస్సు నుంచే శుభ్రత అలవాట్లు పెంపొందించాలని తెలిపారు. తల్లులు పిల్లలకు చేతులు కడుక్కోవడం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి మంచి అలవాట్లు నేర్పించాలని సూచించారు.అలాగే పోషకాహారంపై అవగాహన కల్పిస్తూ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి ఆరోగ్యకరమైన ఆహారం రోజువారీ ఆహారంలో ఉండాలని తెలిపారు. నిల్వ ఉంచిన పాత ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు. తాజా ఆహారం మాత్రమే తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వివరించారు.పరిశుభ్రమైన తాగునీరు వినియోగం, పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం ద్వారా వ్యాధులను నివారించవచ్చని చెప్పారు. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు నివారించడానికి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యమని వివరించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జి. స్వరూప రాణి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న పరిశుభ్రత కార్యక్రమాలను ప్రజలు సక్రమంగా వినియోగించుకోవాలని, అందరూ కలిసి పనిచేస్తేనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయురాలు టీ. విజయ, అంగన్‌వాడి సిబ్బంది జె. జ్యోతి వి.ఇందిరమ్మ, ఎస్. సాయి చందన, సి.హెచ్. తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam