చిల్లకూరు వద్ద రోడ్డు ప్రమాదం పలువురు మహిళలకుగాయాలు

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిల్లకూరు పోలీస్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి ప్రక్కన ఆగి ఉన్న ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో పలువురు మహిళలు గాయపడ్డారు.వివరాల ప్రకారం, చిల్లకూరు మండల పరిధిలోని కోట క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న రైటర్ సత్రం కాలనీకి చెందిన పొదుపు మహిళలు ఆటోలో మండల కేంద్రంలో ఉన్న పొదుపు కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన ఆటో నిలిపి ఉన్న సమయంలోనే లారీ వెనుక నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది.సమాచారం అందుకున్న 108 అత్యవసర సేవల సిబ్బంది ఈ.ఎం.టి కృష్ణ, పైలెట్ పెంచలయ్య వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన మహిళలకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని గూడూరు ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘటనపై చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలపై విచారణ కొనసాగుతోంది.రోడ్డు భద్రతపై జాగ్రత్త అవసరంజాతీయ రహదారులపై వాహనాలను నిలిపే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. వేగ నియంత్రణ, సిగ్నల్ సూచనలు పాటించడం ద్వారా ఇలాంటి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.

Prajaveek Shanam