వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం

గోపిక సహస్ర పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో బుధవారం కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముచ్చకాల విజయకుమార్, కల్పన దంపతుల పుత్రిక గోపిక సహస్ర 11వ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టడం విశేషం.
వేరే దేశంలో ఉన్నప్పటికీ తమ కుమార్తె పుట్టినరోజును పేదవారితో పంచుకోవాలనే సంకల్పంతో వృద్ధులు, అనాథ పిల్లలు, వికలాంగులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమంలో ఉన్న వారికి భోజనాన్ని అందించి, వారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ, గత రెండేళ్లుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గోపిక సహస్ర పుట్టినరోజు సందర్భంగా దాతల సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.రానున్న రోజుల్లో కూడా దాతలు సహకరిస్తే వారానికి రెండు సేవా కార్యక్రమాలు నిర్వహించి నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, కన్వీనర్ పర్వతాల రమేష్, సభ్యులు చవల సురేంద్ర, పేయ్యల రమణయ్య, ఎస్.కె. ముజీబ్ రమణయ్య, వృద్ధాశ్రమ నిర్వాహకురాలు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam