సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా షేక్ జమాలుల్లా ఎంపిక

గూడూరులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్ర సాయి

సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా షేక్ జమాలుల్లా ఎంపికయ్యారు. బుధవారం గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమితి ముఖ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి నూతనంగా నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా ఎంపికైన జమాలుల్లాకు బ్యాడ్జి ఇచ్చి, ఎన్నో ప్రజా ఉద్యమాలకు జమాలుల్లా నాయకత్వం వహించారని, ఆయన సేవలు గూడూరు నియోజకవర్గంలోని పార్టీకి కూడా పూర్తిగా కొనసాగించాలని . ఆయనను అభినందించారు. నియోజకవర్గ సహాయ కార్యదర్శిగా ఎంపికైన షేక్ జమాలుల్లా మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంలో సీపీఐ బలోతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. సీనియర్ నాయకుల సమన్వయంతో జిల్లా, రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, పట్టణ కన్వీనర్ వై. సునీల్, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి కే. నారాయణ, బీకేఎంయూ నియోజకవర్గ కార్యదర్శి ఎన్. శ్రీనివాసమూర్తి, మున్సిపల్ యూనియన్ రాఘవయ్య, ముఠా వర్కర్స్ యూనియన్ పెంచలయ్య, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు మీరా, గౌస్ భాయ్, యాకోబు తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam