వెల్లివిరిసిన అభిమానం… గూడూరులో అంగరంగ వైభవంగా డేగ రవి రాఘవేంద్ర జన్మదిన వేడుకలు

గూడూరు పట్టణంలో యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగ రవి రాఘవేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బనిగిసాహెబ్ పేట, అరుంధతీయ వాడల్లో పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు భారీ క్రేన్ సహాయంతో గజమాల వేసి ఘన స్వాగతం పలికారు. పట్టణంలో పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి ఆనందోత్సాహాలను వ్యక్తం చేశారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించగా, స్థానిక ఏరియా ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రొట్టెలు పంపిణీ చేశారు.
నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బనిగి సాహెబ్ పేట సెంటర్‌లో అరుంధతి పాలెం కు చెందిన సర్వేపల్లి మురళి, దాల మణికుమార్, అయ్యప్ప ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. క్రేన్ సహాయంతో భారీ గజమాల వేసి రవి రాఘవేంద్రకు ఘన స్వాగతం పలికారు. అభిమానులు భాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అరుంధతి పాలెం మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీ మాతా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు. తరువాత ప్రభుత్వ ఆస్పత్రి మెటర్నిటీ వార్డు రోగులకు రొట్టెలు, పండ్లు అందించారు.
ఈ సందర్భంగా డేగ రవి రాఘవేంద్ర మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యల పరిష్కారానికి అలుపెరుగని పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో బడుగు, బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించిన ఫోరం సభ్యులు, మహిళలు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం జాతీయ ఉపాధ్యక్షుడు విజయ్ అంబెడ్కర్, సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పందిటి సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి కృష్ణ, యునైటెడ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు కుడుముల సుబ్బారావు, డిఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రభుదాస్, ఎంఈఎఫ్ నాయకులు తోళ్ల నారాయణ, చింతకుంట మస్తానయ్య, పార్థసారథి, గుంటూరు దయాసాగర్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉద్దాల మణి, అయ్యప్ప, మురళి, లతా నాయక్, దేవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam