శ్రీరామనవమికి ముందుగానే నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి పనుల జాతర ప్రారంభమైంది

నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ శ్రీరామనవమికి ముందుగానే నెల్లూరు రూరల్‌లో అభివృద్ధి పనుల జాతర ప్రారంభమైంది అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారుపల్లిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో కలిసి రూ.27 కోట్ల వ్యయంతో చేపట్టిన 240 అభివృద్ధి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు భారీగా పాల్గొని ఘన స్వాగతం పలికారు మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ప్రశంసించారు నెల్లూరు రూరల్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు ప్రభుత్వం ఎల్లప్పుడూ ఎమ్మెల్యేకు అండగా ఉంటుందని అభివృద్ధిలో అందరం భాగస్వాములమవుతామని స్పష్టం చేశారు నగరాభివృద్ధి కోసం మంత్రి నారాయణ ఎమ్మెల్యే కోటంరెడ్డి సమన్వయంతో మేయర్ డిప్యూటీ మేయర్ నిధులను సమీకరించి నగర కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచాలని సూచించారు దేవాదాయశాఖ ద్వారా రూరల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని 29 ఆలయాలకు ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతి నెలా ₹10,000 చొప్పున అందిస్తున్నామని నాలుగు పురాతన ఆలయాల పునర్నిర్మాణానికి ₹10.40 కోట్లు మంజూరు చేశామని తెలిపారు శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా కొత్త ఆలయాల నిర్మాణం కొనసాగుతోందని రాష్ట్రవ్యాప్తంగా 5,000 పైగా ఆలయాలను ₹700 కోట్లతో నిర్మిస్తున్నామని వివరించారు 2027లో గోదావరి 2028లో కృష్ణ పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందన్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని పింఛన్లు పెంచి ఇంటికే పంపుతున్నామని అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఏడాదికి ₹20,000 అందిస్తున్నామని తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నామని మహిళలకు దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని తెలిపారు పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామని పోర్టుల నిర్మాణం ద్వారా మత్స్యకారులను ఆదుకుంటున్నామని చెప్పారు రైతాంగానికి అండగా జిల్లాలో 161 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ఇప్పటికే 18,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు రైతులు ఎంత ధాన్యం ఇచ్చినా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారని చెప్పారు జనగణన అనంతరం డీలిమిటేషన్ ప్రకారం అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని నెల్లూరు మూడు నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉందన్నారు 2029 నాటికి తన రాజకీయ ప్రస్థానం 46 సంవత్సరాలు పూర్తవుతుందని ప్రజల మధ్య ఎటువంటి మచ్చ లేకుండా కొనసాగించడం సంతోషంగా ఉందన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వయంకృషితో ఎదిగిన నాయకుడని కోటంరెడ్డి సోదరులతో తనకు సోదర భావం ఉందని వారి భవిష్యత్తుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే కోటంరెడ్డి ప్రత్యేక శైలి కలిగిన నాయకుడని అనేక అభివృద్ధి పనులు పూర్తి చేశారని ప్రశంసించారు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచర్ల వద్ద పెద్ద పరిశ్రమ రానుందని దాని ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు ఇప్పటికే ₹613 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు గతంలో భూగర్భ డ్రైనేజీకి ₹500 కోట్లు ప్రస్తుతం ₹140 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి రెండూ వేగంగా కొనసాగుతున్నాయని రాజధాని నిర్మాణం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రూరల్‌లో పూర్తి చేసిన టెండర్ దశలో ఉన్న ప్రారంభించబోయే పనులు కలిపి ₹613 కోట్ల వరకు అభివృద్ధి జరుగుతోందన్నారు కొండాయపాలెం గేట్ బీవీనగర్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జ్‌కు ₹31 కోట్లు మంజూరు చేసినట్లు త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడ్కో చైర్మన్ అజయ్ నగర మేయర్ సుజాత డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ భాను శ్రీ స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు

Prajaveek Shanam