ఎండలు ఎక్కువవుతున్న తరుణంలో ఆర్.వి ఫౌండేషన్ వారు కూలింగ్ ఫ్రిజ్ లు ఏర్పాటు చేయడం హర్షనీయమని కోట మండల తహసిల్దార్ జయ జయ రావు పేర్కొన్నారు.నెల్లూరు జిల్లా, కోట మండలం,కోట పట్టణంలోని ఆర్ అండ్ బి రోడ్డు పక్కన ప్రభుత్వ సముదాయాలకు వెళ్లే దారిలో ఆర్.వి ఫౌండేషన్ సొంత ఖర్చులతో మంగళవారం కూలింగ్ ఫ్రిజ్ ను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తహసిల్దార్ కటారి జయ జయ రావు చేతుల మీదగా కూలింగ్ ఫ్రిడ్జ్ చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా తహసిల్దార్ జయ జయ రావు మాట్లాడుతూ ఆర్ వి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం అన్నారు.ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ప్రజల సౌకర్యార్థం సొంత నిధులతో చలివేంద్రాలు ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఇంకా మరెన్నో మంచి సేవా కార్యక్రమాలతో ముందుకెళ్లాలని ఆకాంక్షించారు.అనంతరం ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ వెంకట కృష్ణయ్య మాట్లాడుతూ కోట, వాకాడు,చిట్టమూరు,చిల్లకూరు, మండలాల నుండి కోట పట్టణానికి వచ్చే ప్రజలకు ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ జయ జయ రావు, ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ వెంకట కృష్ణయ్య, బిజెపి నాయకులు పనబాక కోటేశ్వరరావు, పుచ్చలపల్లి రమణయ్య, పురిని సుబ్రహ్మణ్యం, పాకం చెన్నకేశవులు,దాన సుధాకర్, టి శ్రీనివాసులు, రాయపు హరిబాబు, దామరపు అవినాష్ , తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.












