
గూడూరు పట్టణం :- నెల్లూరు నుండి గూడూరు పట్టణంలోకి, గూడూరు పట్టణం నుండి చెన్నై వైపు రాకపోకలు సాగించే ప్రజలు మరియు బస్సుల రాకపోకలకు తీవ్ర అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో పోటుపాలెం జంక్షన్ సమీపంలోని NH16 వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెల సమస్యపై స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎమ్మెల్యే Dr. Pasim Sunil Kumar దృష్టికి తీసుకురాగా, ఆయన వెంటనే స్పందించి పై అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
పోటుపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సిమెంట్ దిమ్మెల కారణంగా నెల్లూరు వైపు నుండి గూడూరు టౌన్ లోకి ప్రవేశించే వాహనదారులు, అలాగే గూడూరు పట్టణం నుండి చెన్నై వైపు వెళ్లే వాహనాలు, ముఖ్యంగా బస్సులు మరియు భారీ వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రజలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సంబంధిత అధికారులతో సమావేశమై ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించి, సిమెంట్ దిమ్మెలను తొలగించేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రజలకు ఇబ్బందులు కలిగించే ఎలాంటి సమస్యలైనా వెంటనే పరిష్కరించడం తమ బాధ్యత అని తెలిపారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలగకుండా, రహదారులపై సౌకర్యవంతమైన ప్రయాణం ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. పోటుపాలెం జంక్షన్ వద్ద రాకపోకలు అధికంగా ఉండటం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.అలాగే ఇదే సర్కిల్ పరిధిలో సుమారు 26 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునిక సదుపాయాలతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయిన తర్వాత నెల్లూరు – గూడూరు – చెన్నై మార్గాల్లో ప్రయాణించే వాహనదారులకు భారీగా ఉపశమనం కలుగుతుందని, ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు.
ఫ్లైఓవర్ నిర్మాణం వల్ల ప్రజలకు సమయం ఆదా కావడంతో పాటు రహదారి ప్రమాదాలు కూడా తగ్గే అవకాశం ఉందని ఎమ్మెల్యే వివరించారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని, రవాణా సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.స్థానిక ప్రజలు మరియు వాహనదారులు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకున్న ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం కావడం వల్ల గూడూరు పట్టణానికి మరింత అభివృద్ధి దిశగా ముందడుగు పడుతుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.












