మహిళా శక్తి దేశ అభివృద్ధికి పునాది – మట్టం శ్రావణి రెడ్డి

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పార్లమెంట్ మహిళ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా పార్లమెంట్ తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి మహిళలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.మహిళలు సమాజంలో ప్రతి రంగంలోనూ ముందంజలో నిలుస్తూ దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నారని ఆమె అన్నారు.మహిళల సాధికారతే సమాజ పురోగతికి ప్రధాన బలమని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయాలు, క్రీడలు, సాంకేతిక రంగాలు వంటి అనేక రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. కుటుంబాన్ని సమర్థంగా నిర్వహించడమే కాకుండా సమాజ అభివృద్ధిలో కూడా మహిళలు విశేషంగా సేవలు అందిస్తున్నారని అన్నారు.
మహిళల కృషి, పట్టుదల, ఆత్మవిశ్వాసం సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాన శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం సమాజ బాధ్యత అని, మహిళలు విద్యలో ముందంజలో ఉండాలని, తమ హక్కులు మరియు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే వారు ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని తెలిపారు. .మహిళల అభివృద్ధి కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలు మరియు వివిధ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాలను మహిళలు వినియోగించుకుని తమ జీవితాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ఆమె సూచించారు.మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, వేధింపులు మరియు హింస వంటి ఘటనలను అరికట్టేందుకు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె అన్నారు. మహిళలు ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారికి న్యాయం అందేలా చట్టాలు మరియు ప్రభుత్వ వ్యవస్థలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.
కుటుంబ సభ్యులు కూడా మహిళలకు ప్రోత్సాహం ఇవ్వాలని, మహిళల ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు కల్పించాలని అన్నారు..మహిళలు సమాజానికి మార్గదర్శకులుగా నిలుస్తారని, మహిళల అభివృద్ధి ద్వారా దేశం మరింత పురోగమిస్తుందని , మహిళా శక్తి దేశ శక్తి అని, మహిళలు ఎదిగితే దేశం మరింత అభివృద్ధి చెందుతుందని మట్టం శ్రావణి రెడ్డి అన్నారు.ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన కోసం స్వయం సహాయక సంఘాలు, ఉపాధి అవకాశాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతూ మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నదని అన్నారు. అలాగే గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చి, మహిళల అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలను చేపడుతున్నారని ఆమె తెలిపారు. మహిళలకు రాజకీయాల్లోనూ, సమాజంలోనూ తగిన స్థానం కల్పించేందుకు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఎప్పటికప్పుడు ప్రోత్సాహం అందిస్తున్నారని అన్నారు. మహిళల సమస్యలను పరిష్కరించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని పేర్కొన్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి మహిళకు ప్రేరణగా నిలవాలని, మహిళలు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగి సమాజంలో గౌరవప్రదమైన స్థానం సంపాదించాలని ఆమె ఆకాంక్షించారు.

Prajaveek Shanam