
కోట మండలంలోని తిన్నెలపూడి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రెండవ విడతలో మంజూరు అయిన పట్టాదారు పాస్‌బుక్‌లను రైతులకు అందజేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. రైతులకు భూములపై స్పష్టమైన హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్‌బుక్‌లను అందజేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.రైతులు తమ భూముల పట్ల ఎలాంటి అనుమానాలు లేకుండా, న్యాయపరమైన రక్షణతో వ్యవసాయం చేసుకునేలా ఈ పాస్‌బుక్‌లు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు భూముల వివరాలు స్పష్టంగా నమోదు చేయబడిన ఈ పాస్‌బుక్‌లు భవిష్యత్తులో రైతులకు మరింత భరోసా కల్పిస్తాయని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా తిన్నెలపూడి గ్రామంలోని పలువురు రైతులకు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ స్వయంగా పట్టాదారు పాస్‌బుక్‌లను అందజేశారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు తమ వంతు కృషి కొనసాగుతుందని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.











