గూడూరు పట్టణంలో సెంట్రల్ లైటింగ్ ప్రారంభం

గూడూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంక్ సెంటర్, అరుంధతీయవాడ పెట్రోల్ బంక్ సెంటర్, సాధుపేట సెంటర్, రెండవ పట్టణంలోని విందూరు–చెన్నూరు వై జంక్షన్ ప్రాంతాల్లో సుమారు రూ.7 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్‌ను గూడూరు శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు సౌకర్యాలు కల్పించే దిశగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ముఖ్య కూడళ్లలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల రాత్రి వేళల్లో ప్రయాణికులకు సౌలభ్యం కలుగుతుందని, భద్రత కూడా మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Prajaveek Shanam