ఈ నెల 17న సీఎం చంద్రబాబు నాయుడుపేట పర్యటన – టిడ్కో ఇళ్ల ప్రారంభం

నాయుడుపేట, మార్చి 10: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 17న నాయుడుపేట పట్టణంలో పర్యటించి టిడ్కో ఇళ్లను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ తెలిపారు.
మంగళవారం నాయుడుపేట మండలంలోని టిడ్కో ఇళ్ల ప్రాంతాన్ని కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తదితరులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్, సభా ప్రాంగణం తదితర ఏర్పాట్లపై అధికారులు సమీక్ష నిర్వహించారు.
పర్యటనకు సంబంధించి శానిటేషన్, విద్యుత్, రోడ్లు, మొక్కలు నాటడం వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణ టీడీపీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ, నాయుడుపేట ఏఎంసీ చైర్మన్, జనసేన పార్టీ సూళ్లూరుపేట ఇంచార్జి ఉయ్యాల ప్రవీణ్, పోలేరమ్మ ఆలయ కమిటీ చైర్మన్ నానబాల సుబ్బారావు, టీడీపీ నాయకులు అవదానం సుధీర్, పసల గంగా ప్రసాద్, పలుకూరు ముత్యాలయ్య, వినుకొండ ధనుంజయ, నిత్య కృష్ణారెడ్డి, మొండెం బాబు, చిట్టెటి రేవతి, మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజులుల్లా తదితరులు పాల్గొన్నారు.

Prajaveek Shanam