
నెల్లూరు, మార్చి 10: రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, రియల్ టైం గవర్నెన్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ నెల 12న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
ఆ రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు బోగోలు మండలం జువ్వలదిన్నెకు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహించే సాగర్ డిఫెన్స్ ఫౌండేషన్ స్టోన్ కార్యక్రమంలో పాల్గొంటారు.
అనంతరం సాయంత్రం 6 గంటలకు జువ్వలదిన్నె నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉండవల్లి స్వగృహానికి వెళ్లనున్నట్లు కలెక్టర్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.











