
గూడూరు రూరల్ మండలం చవటపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు. గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ సూచనల మేరకు, పాఠశాల హెడ్మాస్టర్ మరియు ఉపాధ్యాయుడు చంద్రన్న కోరిన విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా దివిపాలెం పంచాయితీ టిడిపి అధ్యక్షులు రావూరు సురేంద్ర, యేసుపాక పెంచలయ్య, అంకిరెడ్డి రమేష్ రెడ్డి పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ ప్యాడ్స్, పెన్లు, జామెంట్రీ బాక్సులు, స్కెచ్ పెన్లు తదితర పరీక్షా సామగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా యేసుపాక పెంచలయ్య మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని అన్నారు. ఈ నెల 16వ తేదీ నుండి ప్రారంభమయ్యే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు బాగా సిద్ధం కావాలని,సమయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదవాలని సూచించారు. తల్లిదండ్రులు మీపై ఎంతో నమ్మకం పెట్టుకుని చదివిస్తున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా మంచి ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు.
రావూరు సురేంద్ర మాట్లాడుతూ, పదో తరగతి అనేది విద్యార్థుల భవిష్యత్తుకు మొదటి మెట్టు అని పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుంటే మంచి విజయాలు సాధించవచ్చని, పరీక్షలను ధైర్యంగా రాయాలని విద్యార్థులను ప్రోత్సహించారు. భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ కార్యదర్శి మరియు యూనిట్ ఇన్చార్జి అంకిరెడ్డి రమేష్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.











