
ఆంధ్రప్రదేశ్ టిక్కో చైర్మన్ అజయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా గూడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని లలిత జ్యువెలరీ ఎదురుగా, ఆల్ ఇస్లాం పవర్ టూల్స్ వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, బిర్యానీ పంపిణీ చేశారు.పేదలకు అన్నం పంపిణీ చేస్తూ జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా జరపడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. మునిగిరీష్ మాట్లాడుతూ అజయ్ కుమార్ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. చంద్రనిల్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం పేదలకు అన్నం పంపిణీ చేసే వ్యక్తిగా అజయ్ కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని, ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన మునిగిరీష్, చంద్రనిల్‌కు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జనసేన నాయకుడు సయ్యద్ నయం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మునిగిరీష్, చంద్రనిల్, సయ్యద్ నయం, షేక్ హుస్సేన్, షేక్ మహాభాష, రాజా, ఇర్ఫాన్, తేజ తదితరులు పాల్గొన్నారు.











