
బుద్ధా పిరమిడ్ ధ్యాన ఆశ్రమం ఆధ్వర్యంలో చాణిక్య ఆధ్యాత్మిక పాలన శిక్షణా శిబిరం రెండవ రోజు ఘనంగా జరిగింది ఈ కార్యక్రమం డాక్టర్ గోపాల కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించబడింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గోపాల కృష్ణ మాట్లాడుతూ ధ్యానం సర్వరోగ నివారిణి అని తెలిపారు ధ్యానం ద్వారా మనిషి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలడని తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు అనేక వ్యాధులను నియంత్రించుకోవచ్చని వివరించారు తాను ఒక ఎంబిబిఎస్ డాక్టర్ అయినప్పటికీ ధ్యానం యొక్క శాస్త్రీయ ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న తర్వాత వైద్య వృత్తిని విడిచి ధ్యానం మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రజల్లో విస్తరించే దిశగా కృషి చేస్తున్నానని చెప్పారు పత్రీజీ ఆశయ సాధనలో భాగంగా సమాజంలో ధ్యానం ప్రాముఖ్యతను చాటుతూ జీవితం యొక్క అసలైన ధ్యేయం ఆధ్యాత్మిక పురోగతేనని పేర్కొన్నారు ప్రతి వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మిక పాలన ఎంతో అవసరమని దాన్ని తెలుసుకుని ఆచరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి సమాజాన్ని సన్మార్గంలో నడిపించగలడని లీడర్కు ఉండాల్సిన 25 ముఖ్య గుణాలను వివరించారు మన భౌతిక జీవితం సుఖసంతోషాలతో ఉండాలంటే ముందుగా ఆధ్యాత్మిక జీవన విధానాన్ని సరిచేసుకోవాలని సూచించారు ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు శారీరక ఆరోగ్యం కూడా సాధ్యమవుతుందని తెలిపారు శాఖాహార జీవన విధానం పాటించడం ద్వారా మనిషి ఆలోచనలు శుద్ధి చెంది జీవితంలో ఆనందం పెరుగుతుందని పేర్కొన్నారు ధ్యానం సమాజంలో సానుకూల మార్పులకు దారి తీస్తుందని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు ప్రముఖులు మరియు సుమారు 200 మంది పిరమిడ్ మాస్టర్స్ ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతూ పాల్గొన్న వారిలో చైతన్యాన్ని కలిగించింది











