కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది ప్రకటనలకే పరిమితం కాకుండా భారీ ప్రాజెక్టులు క్షేత్రస్థాయిలో అమలు దశలోకి రావడంతో ఉత్తరాంధ్ర త్వరలోనే దక్షిణ భారతదేశంలో ప్రధాన ఆర్థిక కేంద్రంగా అవతరించబోతోంది ఉత్తరాంధ్ర పారిశ్రామిక చరిత్రలో మార్చి 23 2026 ఒక కీలక మైలురాయిగా నిలవనుంది అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట వద్ద ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ సంస్థ మెగా గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్నారు సుమారు రూ.1.36 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు లక్ష మందికి ఉపాధి లభించనుంది దీనికి అనుబంధంగా రూ.11 198 కోట్లతో ఏర్పాటు కానున్న సొంత ఓడరేవు ఈ ప్రాంత ఎగుమతి దిగుమతులకు ప్రధాన కేంద్రంగా మారనుంది ఐటీ రంగంలో విశాఖపట్నం కొత్త అధ్యాయానికి నాంది పలుకుతోంది సుమారు 15 బిలియన్ డాలర్లు అంటే రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ హబ్ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా ఏప్రిల్ 2026లో శంకుస్థాపన జరగనుంది గూగుల్ తన పూర్తి స్థాయి ఏఐ టెక్నాలజీని ఇక్కడ అమలు చేయడంతో పాటు అంతర్జాతీయ సముద్రగర్భ కేబుల్ నెట్‌వర్క్‌ను విశాఖకు అనుసంధానం చేయనుంది దీని ద్వారా విశాఖ గ్లోబల్ డిజిటల్ గేట్‌వేగా ఎదగనుంది ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1.88 లక్షల ఉద్యోగాలు సృష్టించబడనున్నాయి లిఫ్ట్ పాలసీ ప్రభావంతో విశాఖకు ఐటీ కంపెనీలు భారీగా వస్తున్నాయి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ రూ.1 370 కోట్లతో క్యాంపస్ ఏర్పాటు చేస్తుండగా కాగ్నిజెంట్ రూ.1 583 కోట్లతో ఐటీ పార్క్ నిర్మిస్తోంది అదానీ గ్రూప్ డేటా సెంటర్లు అనకాపల్లిలో అడ్వాన్స్‌డ్ కార్బన్ కాంప్లెక్స్ వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్రను తయారీ సేవల రంగాల్లో సమతుల అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నాయి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 5 లక్షల ఐటీ ఉద్యోగాల్లో విశాఖ కీలక పాత్ర పోషించనుంది రవాణా రంగంలో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టు పనులు వేగంగా సాగుతుండగా విశాఖపట్నం పోర్టులో క్రూయిజ్ టెర్మినల్ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు అందుబాటులోకి వస్తున్నాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి కావడంతో విశాఖకు గ్లోబల్ కనెక్టివిటీ పెరుగుతుంది వచ్చే నాలుగేళ్లలో ఉత్తరాంధ్ర కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశానికి ఆర్థిక ఇంజిన్‌గా మారి స్థానిక యువతకు స్వగ్రామంలోనే ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ముందుకు సాగుతోంది












